భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో రెండు వారాల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే లండన్‌లో అడుగుపెట్టింది. జూన్ 20న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి సీనియర్ ప్లేయర్లు లేకుండా భారత్.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ పలికారు. ఇక చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే లాంటే సీనియర్లను పక్కన పెట్టిన భారత సెలక్షన్ కమిటీ కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది.
అయితే 2018 నుంచి ఇప్పటివరకు భారత జట్టు.. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో సుమారు నాలుగు టెస్టు సిరీస్‌లు ఆడింది. అందులో అత్యధికంగా ఎవరు రన్స్ స్కోరు చేశారు? టాప్-7 బ్యాటర్లు ఎవరు? అందులో ఎవరెవరు ఇప్పుడు ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత జట్టులో ఉన్నారు? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2018 నుంచి ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో 19 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. అందులో 44.31 సగటుతో 842 రన్స్ సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.