ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో.. వెస్టిండీస్‌ 169/4

గ్రెనెడా: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ నిలకడగా ఆడుతున్నది. రెండో రోజు 44 ఓవర్లకు ఆ జట్టు 169/4 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ (75 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో ఆదుకోగా క్యాంప్‌బెల్‌ (40) రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 286 పరుగులకు ఆలౌట్‌ అయింది.

విండీస్‌ పేసర్ల ధాటికి ఆసీస్‌ టాపార్డర్‌ విఫలమవగా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ (63), బ్యూ వెబ్‌స్టర్‌ (60) కంగారూలను ఆదుకున్నారు. వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ (4/61) నాలుగు వికెట్లు తీయగా సీల్స్‌ (2/45)కు రెండు వికెట్లు దక్కాయి.

2025-07-04T21:25:46Z