స్పోర్ట్స్

Trending:


టీ20 ప్రపంచకప్‌ 2024లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ..! నిజమెంతా..?

T20 WC Squad: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికకు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 మంది సభ్యులతో జట్టును దాదాపు ఖరారు చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తాడని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో జట్టులో ఎవరెవరికి చోటు ఉంటుంది? బౌలర్లు ఎవరు? అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


IPL | బౌలర్లను మడతపెట్టి.. బెంగళూరుపై హైదరాబాద్‌ పరుగుల తుఫాన్‌

బంతి దొరికితే బౌండరీ లైన్‌ అవతలకు బాదుదామన్నంత కసిమీద ఉన్న బ్యాటర్లకు పసలేని బౌలర్లు తగిలితే ఎలా ఉంటుంది..? అదీ ‘చిన్నస్వామి’ వంటి బ్యాటింగ్‌ పిచ్‌లో అయితే ఇంకేమైనా ఉందా..? ఆ విధ్వంసానికి పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. బెంగళూరులో సోమవారం రాత్రి బౌలర్ల పరిస్థితి అదే అయింది.


Maxwell: మ్యాక్స్‌వెల్‌కు తుంటి నొప్పి.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు డౌటే

Maxwell: తుంటి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు క్రికెట‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఇప్ప‌టికే ఈ టోర్నీలో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయిన ఆ స్టార్ క్రికెట‌ర్ ప్ర‌స్తుతం క‌ఠిన ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఆదివారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు కూడా అత‌ను ఆడేది డౌట్‌గానే ఉన్న‌ది.


ఢిల్లీ చేతిలో గిల్‌గిల!

భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్‌-17లో తొలిసారిగా ఓ జట్టు 100 పరుగులలోపే చిత్తైంది. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ అంటే ప్రత్యర్థి ఎవరన్నదీ చూడకుండా వీరబాదుడు బాదే గుజరాత్‌ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఊహించని షాకిచ్చింది. తమ బౌలింగ్‌తో చుక్కలు చూపించి టైటాన్స్‌ను 89 పరుగులకే కట్టడిచేసింది.


GT vs DC | టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

GT vs DC | ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో ఢిల్లీ మ్యాచ్‌ కాసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.


IPL GT vs DC Highlights: ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం.. గుజరాత్‌ టైటాన్స్‌కు దారుణ పరాభవం

IPL Live Score 2024 GT vs DC Delhi Capitals Sensation Performance With GT: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన ప్రదర్శన చేసి గుజరాత్‌ టైటాన్స్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. అతి స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసి అనంతరం ఆ లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించింది.


Virat Kohli: కోపం.. ఆవేశం.. కోహ్లీలో టెన్ష‌న్‌.. వీడియో

Virat Kohli: హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో.. బెంగుళూరు బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ చాలా మాన‌సిక వేద‌న‌కు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌వైపు స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్ బాదుతుంటే.. ఆ ఊచ‌కోత‌ను చూసి కోహ్లీ త‌ట్టుకోలేక‌పోయాడు. ర‌క‌ర‌కాల భావోద్వేగాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ త‌నను తాను శాంతి ప‌రుచుకునే ప్ర‌య‌త్నం చేశాడు.


KKR vs RR | బ‌ట్ల‌ర్ ఒంటరి పోరాటం.. బిగ్ వికెట్ ప‌డ‌గొట్టిన‌ హ‌ర్షిత్

KKR vs RR : కోల్‌క‌తా పేసర్ల ధాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) బ్యాట‌ర్లు వ‌రుస పెట్టి పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. ఆప‌ద్భాంద‌వుడు రియాన్ ప‌రాగ్ (34) సైతం ఔటయ్యాడు.


KKR vs RR: బట్లర్‌ సంచలన బ్యాటింగ్‌, ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ను ఓడించిన రాజస్థాన్

KKR vs RR: ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ సంచలన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో ఛేదించింది. తొలుత కేకేఆర్‌ బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌ సెంచరీ కొట్టగా.. ఆ తర్వాత దాన్ని మరిపించేలా అజేయ శతకంతో బట్లర్‌ మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.


హార్దిక్ పాండ్యా vs శివమ్ దూబే.. టీ20 ప్రపంచకప్‌లో ఎవరికి చోటు దక్కేనో!

Hardik Pandya Place Doubtful: ఓ పక్క ఐపీఎల్ 2024 కొనసాగుతుండగానే.. మరోవైపు బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఈనెల చివరి వారంలో జట్టును ప్రకటించాలని భావిస్తున్న బీసీసీఐ.. ఆటగాళ్లపై ఎంపికపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇటీవల అతడి ప్రదర్శన పేలవంగా ఉండటంతో జట్టులోకి తీసుకోవాలా వద్ద అని ఆలోచిస్తోంది. నిలకడగా రాణిస్తున్న శివమ్ దూబే.. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా...


Dinesh Karthik | కామెంటేట‌ర్ కార్తిక్.. టీమిండియా ఫినిష‌ర్ అయ్యేనా..?

Dinesh Karthik : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో దినేశ్ కార్తిక్(Dinesh Karthik) కుర్రాడిలా చెల‌రేగిపోతున్నాడు. ఏడాదంతా కామెంట‌రీతో బిజీగా ఉండే కార్తిక్.. ఐపీఎల్‌లో చిచ్చ‌ర‌పిడుగ‌ల్లే చెల‌రేగిపోతున్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sun Risers Hyderabad)పై కార్తిక్ విధ్వంస‌క ఇన్నింగ్స్ చూసిన మాజీలంతా అత‌డికి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బృందంలో చోటివ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.


సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. గమ్మత్తుగా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్.. ఆ రెండు టీమ్‌లకు వెరైటీగా!

IPL Points Table Toppers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతోంది. చివరి బంతి వరకు సాగుతున్న ఉత్కంఠ పోరాటలతో అసలైన క్రికెట్ మజాను అందిస్తోంది. సంచలన ప్రదర్శనతో కొందరు ప్లేయర్లు తమ జట్లకు అనూహ్య విజయాలను అందిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 31 మ్యాచులు జరగ్గా.. పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది. సేమ్ సేమ బట్ డిఫరెంట్ అన్నట్లుగా ఉంది. పాయింట్ల పట్టికపై పూర్తి వివరాలు ఈ ఇలా ఉన్నాయి.


PV Sindhu | తిరుమల శ్రీవారి సేవలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

PV Sindhu | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత (Olympic medalist) పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు.


టీ20 ప్రపంచకప్ జట్టులోకి దినేశ్ కార్తిక్..! ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్

Dinesh Karthik Batting: టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఐపీఎల్‌లో అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో టీ20 ప్రపంచకప్ రేసులో తాను ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాడు. సోమవారం సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 35 బంతుల్లోనే 83 పరుగులు చేసిన 38 ఏళ్ల డీకే.. టీ20 ప్రపంచకప్ కోసం ఒక్కసారిగా రేసులోకి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్.. అతడిని టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయాలని కోరుతున్నారు.


దంచి కొడుతున్న సన్‌రైజర్స్.. కావ్యా పాప జాతకమే కారణమన్న వేణుస్వామి..

గత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ అదే సన్‌రైజర్స్ ఈ సీజన్లో మాత్రం అదరగొట్టే ఆటతీరు కనబరుస్తోంది. దీంతో గత సీజన్ మొత్తం దిగాలుగా కనిపించిన కావ్య మారన్.. ఇప్పుడు ఆనందంతో ఎగిరి గంతులేస్తోంది. బౌలింగ్ జట్టుగా ముద్రపడిన సన్‌రైజర్స్.. ఈసారి బ్యాట్‌తో విజృంభిస్తోన్న తీరు అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. సన్ రైజర్స్ ఆట తీరు మారడానికి కావ్యా పాప జాతకం కూడా కారణమేనట.


T20 World Cup: జట్టులో చోటుతోపాటు.. విరాట్ కోహ్లి సైతం ఊహించని ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ..?

పొట్టి ప్రపంచ కప్ ముంగిట అభిమానులకు అదిరిపోయే వార్త ఇది. మే 1లోగా వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉండగా.. ఇప్పటికే బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. టీ20 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక విషయమై ముంబైలో సమావేశమైన బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.


విశ్వక్రీడల ‘జ్యోతి’ వెలిగింది

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్‌లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.


Dinesh Karthik: ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో ఇదే బిగ్గెస్ట్ సిక్స్‌.. దినేశ్ కార్తీక్ కొట్టిన ఆ షాట్ చూడాల్సిందే.. వీడియో

Dinesh Karthik: దినేశ్ కార్తీక్ భారీ సిక్స‌ర్ కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతిపెద్ద సిక్స్‌. ఆ షాట్‌కు బంతి 108 మీట‌ర్ల దూరం వెళ్లింది. ఇదే మ్యాచ్‌లో క్లాసెన్ కొట్టిన సిక్స్ 106 మీట‌ర్ల దూరం వెళ్లింది.


KKR vs RR | న‌రైన్ హాఫ్ సెంచ‌రీ.. క్రీజులోకి వ‌చ్చిన ర‌స్సెల్

KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(11) ఎల్బీగా ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆండ్రూ ర‌స్సెల్‌(4), ఓపెన‌ర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు.


KKR vs RR | బ‌ట్ల‌ర్ విధ్వంస‌క శ‌త‌కం.. ఒంటిచేత్తో రాజ‌స్థాన్‌ను గెలిపించేశాడు

KKR vs RR : ఉత్కంఠ పోరాటాల‌తో రంజుగా సాగుతున్న‌ ప‌దిహేడో సీజ‌న్‌లో మ‌రో థ్రిల్ల‌ర్ ఫ్యాన్స్‌ను ఉర్రూత‌లూగించింది. రాజస్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) జ‌య‌భేరి మోగించింది. విధ్వంస‌క‌ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (107 నాటౌట్‌) ఒంటిచేత్తో సంజూ సేన‌ను గెలిపించాడు.


IPL | బంతిని మార్చండి మహాప్రభో.. అప్పుడే రసవత్తరంగా బాల్‌-బ్యాట్‌ సమరం!

బంతికి బ్యాట్‌కు సమానమైన పోరు జరిగితేనే క్రికెట్‌కు అందం! ఆటను చూసేవారికి ఆనందం!! కానీ ఆధునిక క్రికెట్‌లో మాత్రం నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయన్నది బహిరంగ వాస్తవం.


KKR vs RR | ఈడెన్స్‌లో టేబుల్ టాపర్స్ ఫైట్‌.. టాస్ గెలిచిన రాజ‌స్థాన్

KKR vs RR: ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కీల‌క మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సార‌థి సంజూ శాంస‌న్ (Sanju Samson) బౌలింగ్ తీసుకున్నాడు.


ఐపీఎల్‌లో అదరగొడుతున్న టాప్-5 భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీరే.. లిస్ట్‌లో తెలుగు ఆల్ రౌండర్ !

ఐపీఎల్ 2024లో దాదాపు సగం మ్యాచులు ముగిశాయి. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లోనూ పలువురు అన్ క్యాప్డ్ భారత ప్లేయర్లు సత్తాచాటుతున్నారు. భవిష్యత్‌లో టీమిండియా తరపున రాణిస్తామనే భరోసా కల్పిస్తున్నారు. జట్టును ఎంపిక చేసేప్పుడు తమవైపు కూడా చూడమంటూ సెలక్టర్లకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్న టాప్-5 అన్ క్యాప్డ్ ప్లేయర్లపై స్పెషల్ స్టోరీ..


IPL Points Table: ఒక్క విజయంతో 3 స్థానాలు ఎగబాకిన ఢిల్లీ.. రేపు గుజరాత్ మరింత కిందకు!

అహ్మదాబాద్ గ్రౌండ్ గుజరాత్ టైటాన్స్‌కు పెట్టని కోట. అలాంటి మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జీటీని కంగుతినిపించింది. ఈ టోర్నీలో ఇప్పటి దాకా పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్‌పై మాత్రం చెలరేగారు. ఆ జట్టును కేవలం 89 రన్స్‌కే ఆలౌట్ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఊదేసిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఘోర పరాజయంతో గుజరాత్ టైటాన్స్ ఏడో ప్లేస్‌కు పడిపోయింది.


T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దుబే.. ఇందులో నిజమెంత?

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసే పనిలో పడింది భారత్.


11 ఓవర్లు మిగిలి ఉండగానే గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆలస్యంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత గుజరాత్‌ను 89 పరుగులకే కుప్పకూల్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.


‘నా మదర్ టంగ్ తెలుగు’.. దినేశ్ కార్తీక్ వీడియో వైరల్.. కిక్కు రా చారీ కిక్కు..!!

తమిళనాడు క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్న దినేశ్ కార్తీక్ మన తెలుగోడే. ఈ మాట మేం చెప్పడం కాదు.. అతడే స్వయంగా చెప్పాడు. నేను తెలుగోణ్నే.. నా మాతృ భాష తెలుగు అని కార్తీక్ తెలుగమ్మాయి వింధ్య విశాఖతో చెప్పాడు. చెప్పడమే కాదు.. ఆమెతో చాలా సేపు తెలుగులో మాట్లాడాడు. ఇది ఐదు నెలల కిందటి వీడియో కాగా.. సన్‌రైజర్స్‌పై డీకే విధ్వంసం తర్వాత వైరల్ అవుతోంది.


ఒక్క సెంచరీతో బట్లర్ సరికొత్త రికార్డులు.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి, క్రిస్ గేల్‌‌ను దాటేసి.. కోహ్లీకి దగ్గరగా!

Jos Buttler Century Creats New Records In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ రికార్డు సృష్టించాడు. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ కొట్టిన ఈ ప్లేయర్.. ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఆ రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.


Rishabh Pant: టీ20 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బెర్తుకు ఖర్చీఫ్ వేసిన పంత్.. మెరుపు స్టంపింగ్‌తో..!

Rishabh Pant One Handed Catch: ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. టీ20 ప్రపంచకప్ 2024 లో చోటు సంపాదించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచుల్లో రెండు స్టంపింగ్‌లు, రెండు క్యాచులతో పాటు మెరుపు బ్యాటింగ్ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచాడు. టీమిండియా వికెట్ కీపర్ స్థానానికి ఖర్చీఫ్ వేసుకున్నాడు.


ఐపీఎల్‌లో బ్యాటర్ల దండయాత్ర.. బంతిని మార్చాలంటున్న మాజీలు..!

IPL Ball Change: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. బంతి, బ్యాటుకు మధ్య సమరం రసవత్తరంగా సాగేలా.. బంతిని మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూకబూర బంతి బదులు.. ఐపీఎల్‌లో డ్యూక్ బాల్స్ ఉపయోగించాలని కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్, ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కోరారు. దీనిపై బీసీసీఐ స్పందిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.


RCB vs SRH | చిన్న‌స్వామిలో హెడ్, క్లాసెన్ ఊచ‌కోత‌.. ఆర్సీబీకి త‌ప్ప‌ని గుండెకోత‌

RCB vs SRH : ఐపీఎల్ చ‌రిత్ర‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) ఊచ‌కోతకు రికార్డులు మోక‌రిల్లుతున్నాయి. సోమ‌వారం రాత్రి ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండ‌రీల ప్ర‌వాహంతో చిన్న‌స్వామి స్టేడియం త‌డిసిముద్దైంది.


సునీల్ నరైన్‌ను ఏడాది నుంచి బతిమాలుతున్నా, ఎంత మందితో చెప్పించినా వినట్లేదు: వెస్టిండీస్ కెప్టెన్

కరేబియన్ దేశాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సునీల్ నరైన్, కీరన్ పోలార్డ్, రస్సెల్, నికోలస్ పూరన్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆ జాబితా ఎంతో పెద్దది అవుతుంది. అయినా సరే వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో అందర్నీ నిరాశపరుస్తోంది. దీనికి గల కారణాల జోలికి ఇప్పుడు పోవడం లేదు గానీ.. కోల్‌కతా, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక సునీల్ నరైన్ గురించి విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


KKR vs RR | యాభై లోపే రెండు వికెట్లు.. ప‌వ‌ర్ ప్లేలో రాజ‌స్థాన్ స్కోర్..?

KKR vs RR : కొండంత ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) క‌ష్టాల్లో ప‌డింది. ప‌వ‌ర్ ప్లేలోనే ఆ జ‌ట్టు రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. హ‌ర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంస‌న్(12) భారీ షాట్ ఆడి నర‌న్ చేతికి చిక్కాడు.


ఐపీఎల్ రూల్‌పై రోహిత్ శర్మ అసంతృప్తి.. ఆ నిబంధనతో టీమిండియాకు చేటు?

ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చడం కోసం బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధన పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ రూల్‌ టీమిండియా ప్రయోజనాలకు ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇంతకూ ఆ రూల్ ఏంటని అనుకుంటున్నారా..? 2023 నుంచి ఐపీఎల్లో అమలు చేస్తోన్న ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ నిబంధన. ఈ రూల్ కారణంగా భారత ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేసే అవకాశం లేకపోవడం పట్ల రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.


Mahesh Bhupathi: 'ఆర్సీబీని అమ్మేయండి..'.. భారత టెన్నిస్ దిగ్గ‌జం సంచలన వ్యాఖ్యలు..

RCB vs SRH: వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచిన బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత టెన్నిస్ ఆటగాడు ఆర్సీబీ ఫ్రాంచైజీని ఏకిపారేశాడు.


RCB: ఇలాంటి టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే మరొకటి లేదు..!!

RCB IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్స్ బేస్ ఉన్న ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. విరాట్ కోహ్లి కారణంగా ఆ ఫ్రాంచైజీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి సీజన్ ముంగిట.. ఈ సాలా కప్ నమదే అని బెంగళూరు అభిమానులు ధీమాగా చెప్పడం.. చివరికి ఆ జట్టు ప్రదర్శన చూశాక వచ్చేసారి కొడతారులే అని సరిపెట్టుకోవడం సాధారణంగా మారింది. ఈ సీజన్లోనైతే ఆర్సీబీ ప్రదర్శన ముఖ్యంగా ఆ జట్టు బౌలర్ల ప్రదర్శన తీసికట్టుగా మారింది.


Mahesh Bhupathi | ఆర్సీబీని అమ్మేయండి.. బీసీసీఐని కోరిన‌ టెన్నిస్ దిగ్గ‌జం

Mahesh Bhupathi : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) ఆట ప‌సికూన‌ను త‌ల‌పిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో భార‌త టెన్నిస్ దిగ్గ‌జం మ‌హేశ్ భూప‌తి (Mahesh Bhupathi) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.


GT vs DC | తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

GT vs DC | స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్‌ చివరి బంతికి జేక్‌ ఫ్రేజర్‌ (20) ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా క్రీజులో ఉన్నాడు.


ఇక చూడలేం.. ఆర్సీబీని అమ్మేయండి: భారత టెన్నిస్‌ దిగ్గజం

Royal Challengers Bengaluru: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ దారుణ ప్రదర్శనపై భార‌త టెన్నిస్ దిగ్గజం మ‌హేష్ భూప‌తి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆర్సీబీని అమ్మేయండంటూ ట్వీట్‌ చేశాడు. స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీకి అమ్మేయాలని బీసీసీఐని కోరాడు. ఫ్యాన్స్‌ కోసమైనా ఇది చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి మ‌హేశ్ భూప‌తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.


IPL 2024: ఆర్సీబీ ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరొచ్చా..? బెంగళూరు ఛాన్సులు ఎలా ఉన్నాయి?

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ నిరాశాజనకమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి దాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే ఛాన్సెస్ క్లిష్టంగా మారిపోయాయి. ఇక ఆడబోయే ఏడు మ్యాచ్‌ల్లోనే గెలిస్తేనే ఆ జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. అయితే ఈ ఏడింట్లో నాలుగు మ్యాచ్‌లను ప్రత్యర్థి జట్ల హోం గ్రౌండ్స్‌లో ఆడాల్సి రావడం గమనార్హం.


KKR vs RR | అవేవ్ ఖాన్ రిట‌ర్న్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన‌ కోల్‌క‌తా

KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ఆదిలోనే షాక్. గ‌త మ్యాచ్ హీరో ఫిలిప్ సాల్ట్(10) ఔట‌య్యాడు. అవేశ్ ఖాన్ ఓవ‌ర్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చాడు. అవేశ్ ఎడ‌మ వైపు డైవ్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.


IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథా

IPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్‌ నరైన్‌ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్‌ బట్లర్‌ అజేయ శతకంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం పొందింది.


IPL RCB vs SRH Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబాద్‌ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శన

IPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్‌ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.


IPL 2024 Points table: హైదరాబాద్ కొట్టిన దెబ్బకు.. పాయింట్ల పట్టికలో లెక్కలు మారాయ్..

RCB vs SRH Match: ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ధాటికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. మన తెలుగు జట్టు టాప్-4లోకి దూసుకొచ్చింది.


IPL 2024 | ఐపీఎల్‌కు సీఎస్కే ఓపెన‌ర్ దూరం.. ఇంగ్లండ్ పేస‌ర్‌కు చాన్స్

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఓపెనింగ్ క‌ష్టాలు ఎదుర్కొంటున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు భారీ షాక్. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(Devan Conway) మెగా టోర్నీ మొత్తానికి దూర‌మ‌య్యాడు.


T20 World Cup | బౌలింగ్ చేయాల్సిందే.. పాండ్యాకు బీసీసీఐ అల్టిమేటం

T20 World Cup : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగుతోంది. ఈ ఎడిష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ సార‌థిగా ఎంపికైన హార్దిక్ పాండ్యా(Hadhik Pandya) వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కీల‌కం కానున్నాడు. అయితే బౌల‌ర్‌గా రాణిస్తేనే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులోకి పాండ్యా వ‌చ్చే చాన్స్ ఉంది.


KKR vs RR | న‌రైన్ వీరోచిత‌ సెంచ‌రీ.. మ‌ళ్లీ రెండొంద‌లు కొట్టేసిన కోల్‌క‌తా

KKR vs RR ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో సెంచ‌రీల ప‌ర్వం న‌డుస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓపెన‌ర్(Kolkat Knight Riders) సునీల్ నరైన్(109) వంద కొట్టేశాడు. కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 223 ర‌న్స్ చేసింది.


Olympic Flame: ఒలింపియాలో వెల‌గనున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడ‌ల జ్యోతి

Olympic Flame: పారిస్‌లో ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల కోసం ఇవాళ ఒలింపిక్ జ్యోతిని వెలిగించ‌నున్నారు. ప్రాచీన గ్రీసు న‌గ‌ర‌మైన ఒలింపియాలో ఆ ప‌విత్ర కార్యాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఒలింపిక్స్ క్రీడ‌లు పుట్టిన ఒలింపియాలో జ్యోతిని ఇవాళ వెలిగించ‌నున్నారు.


గ్రూప్‌ దశలోనే వెనుదిరిగిన శ్రీజ, మనికా

చైనాలోని మకావు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) వరల్డ్‌ కప్‌లో భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు శ్రీజ ఆకుల, మనికా బాత్రాలు గ్రూప్‌ దశలోనే వెనుదిరిగారు.


ధోనీ ఇలా ర్యాగింగ్ కూడా చేస్తాడా.. చూస్తే నవ్వాగదు..!

MS Dhoni Teasing: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ 2024 సీజన్‌లో తన మార్కు సిక్సర్లతో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, కీపింగ్, వ్యూహాలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ధోనీ చేసిన పని ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చెప్పిన మాట వినకుండూ అటూ ఇటూ తిరుతున్న ఫీల్డర్‌ను టీజ్ చేసిన ధోనీ.. నవ్వులు పూయించాడు.