ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023(WPL 2023)లో టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబయి ఇండియన్స్(Mumbai Indians)కి ఈరోజు యూపీ వారియర్స్ బౌలర్లు చుక్కలు చూపించేశారు. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్ సరిగ్గా 20 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌటైంది. ఆ టీమ్‌లో ఇసీ వాంగ్ (32: 19 బంతుల్లో 4x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ హేలీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్‌కి ఆరంభం నుంచే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ యస్తికా భాటియా (7), బ్రంట్ (5) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోయారు. అయితే.. మరో ఓపెనర్ మాథ్యూస్ (35), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (25) దూకుడుగా ఆడటంతో ముంబయి మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది.
కానీ.. మిడిల్ ఓవర్లలో ముంబయి టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కేర్ (3), అమజోత్ కౌర్ (5), ఖాజీ (4), గుజ్జార్ (3), కలిత (3), సైకా (0) తక్కువ స్కోరుకే పరిమితమైపోయారు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా మూడు, గైక్వాడ్ , దీప్తి శర్మ చెరో రెండు, అంజలి శర్వాణి ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూపీఎల్ 2023లో ఐదు మ్యాచ్‌లాడిన ముంబయి.. అన్నింటిలోనూ విజయం సాధించింది.
Read Latest
,
,
2023-03-18T12:15:14Z dg43tfdfdgfd