TEAM INDIA ప్లేయర్లకి వరుస గాయాలు.. ఎన్‌సీఏపై బీసీసీఐ పెద్దలు ఫైర్?

భారత క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గత ఏడాది నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. తాజాగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వెన్ను నొప్పితో టీమ్‌కి దూరమయ్యాడు. ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించింది. కానీ.. ఇద్దరూ మ్యాచ్‌ల వ్యవధిలోనే మళ్లీ గాయపడ్డారు. దాంతో ఎన్‌సీఏ తీరుపై బీసీసీఐ పెద్దలు మండిపడినట్లు తెలుస్తోంది.

జస్‌ప్రీత్ బుమ్రా 2019 నుంచి వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది ఆసియా కప్‌కి ముందు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన రెండు మ్యాచ్‌ల వ్యవధిలో గాయపడ్డాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌‌కి ముందు గాయపడ్డాడు. అతను తొలి టెస్టు ఆడలేదు. కానీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించాడని ఎన్‌సీఏ చెప్పింది. కానీ.. నాలుగో టెస్టులో అతను వెన్ను నొప్పితో బ్యాటింగ్‌కి రాలేదు.

ప్లేయర్ల ఫిట్‌నెస్ విషయంలో ఎన్‌సీఏ గత కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో గాయపడిన ఆటగాళ్లు ఫిట్‌నెస్ సాధించిన తర్వాత వారికి యో-యో ఫిట్‌నెస్ పరీక్షల్ని ఎన్‌సీఏ నిర్వహించేది. కానీ.. ఇటీవల యో-యో టెస్టు గురించే చర్చే లేదు. ప్లేయర్లు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించక ముందే టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో.. మళ్లీ గాయపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-24T17:03:56Z dg43tfdfdgfd