SANJU SAMSON: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ

Shashi Tharoor supports Sanju Samson after Suryakumar Yadav 3rd golden duck: టీమిండియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా సునాయాసంగా గెలిచే మూడో మ్యాచులో రోహిత్ సేన ఓడిపోయింది. ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో ఒక్క పరుగు కూడా చేయలేదు. మూడో మ్యాచులలో గోల్డెన్‌ డకౌట్ అయ్యాడు. దాంతో సోషల్ మీడియాలో సూర్యపై విమర్శలు ఎక్కువయ్యాయి. సంజూ శాంసన్ లాంటి మెరుగైన ఆటగాడిని తీసుకోకుండా.. వరుసగా విఫలమవుతున్న ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు మండిపడుతున్నారు. 

సూర్యకుమార్‌ యాదవ్ పేలవమైన ఆటతీరుపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ స్పందించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని, భారత జట్టులోకి రావాలంటే సంజూ ఇంకా ఏం చేయాలి? అని ప్రశ్నించారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ సూర్యకుమార్‌కు బీసీసీఐ ఎందుకు అండగా ఉందని ట్విటర్‌ వేదికగా అడిగారు.

'పాపం సూర్యకుమార్‌ యాదవ్‌.. వరుసగా మూడుసార్లు గోల్డెన్‌ డక్‌ అయి ప్రపంచంలోనే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇంతకుముందు అతడు ఎప్పుడూ ఆడని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా.. 66 సగటుతో ఉన్న సంజూ శాంసన్‌ని ఎందుకు భారత జట్టులోకి తీసుకోవడం లేదు?. భారత జట్టులోకి రావాలంటే సంజూ ఇంకా ఏం చేయాలి' అని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీటుకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. సంజూకి శశి థరూర్‌ అండగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా బీసీసీఐని నిలదీశారు. 

సూర్యకుమార్‌ యాదవ్‌ను సంజూ శాంసన్‌తో పోల్చవద్దని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. ఎవరు బాగా ఆడితే వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయని.. సూర్యకుమార్‌ని సంజూతో పోల్చకండన్నారు. సంజూ బ్యాడ్‌ఫేజ్‌లో ఉంటే.. మీరు మరొకరి గురించి మాట్లాడతారని కపిల్ అన్నారు. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే.. మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఎవరి అభిప్రాయం వారు చెప్పినా.. చివరికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని కపిల్‌ చెప్పారు.

Also Read: Brave Lady Traps Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి

Also Read: Sisters Catching 5 King Cobra's: బొక్కలో ఐదు కింగ్ కోబ్రాలు.. ఒట్టి చేతులతో ఈజీగా పట్టేసిన అక్కాచెల్లెళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

2023-03-24T06:45:30Z dg43tfdfdgfd