SACHIN TENDULKAR | వ‌న్డేల‌కు ఆద‌ర‌ణ పెర‌గాలంటే..? టెస్టుల‌ త‌ర‌హా మార్పులు అవ‌స‌రం : స‌చిన్

Sachin Tendulkar  : క్రికెట్ గాడ్‌(Cricket God)గా అభిమానుల‌ను అల‌రించిన‌ భార‌త మాజీ క్రికెట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ (Sachin Tendulkar) వ‌న్డే క్రికెట్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. వ‌న్డే ఫార్మాట్‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చేందుకు కొన్ని సూచ‌న‌లు చేశాడు. అవేంటంటే..? వ‌న్డే మ్యాచ్‌ను నాలుగు భాగాలుగా అంటే.. 25 ఓవ‌ర్ల‌కు ఒక భాగంగా విభ‌జించాలని ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్ తెలిపాడు. ‘టెస్టుల్లో 20 వికెట్లు ఉంటాయి. కానీ, వ‌న్డేల్లో మాత్రం 10 వికెట్లు ఉంటాయంతే. ఒక‌సారి ఔట‌య్యారంటే.. మ‌రో 25 ఓవ‌ర్లు ఆట నుంచి త‌ప్పుకున్న‌ట్టే’ అని స‌చిన్ వివ‌రించాడు. అంతేకాదు టాస్, తేమ వంటి వాటి ప్ర‌భావం మ్యాచ్‌పై ప‌డ‌కుండా చూసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ చెప్పుకొచ్చాడు.

తాను ఈ మార్పులు సూచించ‌డానికి కార‌ణం ఏంట‌నేది కూడా స‌చిన్ చెప్పాడు. ‘మేము శ్రీ‌లంక‌లో ఒక టోర్న‌మెంట్‌లో 118 ఓవ‌ర్లు ఆడాం. ఫ‌లితం మాత్రం తేల‌లేదు. మొద‌టి రోజు శ్రీ‌లంక ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసింది. మేము 10 ఓవ‌ర్లు ఆడాక‌ వ‌ర్షం ప‌డింది. దాంతో ఆ రోజు మ్యాచ్ ఆపేశాం. మ‌రుస‌టి రోజు కూడా ఆట సాగ‌లేదు. అలా 118 ఓవ‌ర్లు ఆడినా ఫలితం లేక‌పోయింది’ అని స‌చిన్ వెల్ల‌డించాడు.

అత్య‌ధిక శ‌త‌కాలు 

ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్‌ దాదాపు ముఫ్ప‌యేళ్లుగా త‌న బ్యాటింగ్ విన్యాసాల‌తో ఫ్యాన్స్‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టాడు. త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపిస్తూ అత్య‌ధికంగా 100 శ‌త‌కాలు బాదాడు. అంతేకాదు మూడు ఫార్మాట్ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ రికార్డుల రారాజు 2012లో ఆట‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌(IPL)లోనూ ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)కు ఆడి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

IND vs AUS | రాహుల్ హాఫ్ సెంచ‌రీ.. తొలి వ‌న్డేలో 5 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

Tim Paine | క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

2023-03-17T17:21:03Z dg43tfdfdgfd