PCB | కరాచీ: త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్‌లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే గడాఫీ స్టేడియం (లాహోర్), నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ)కు మార్చింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ స్టేడియాలలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా అవి నత్తనడకన సాగుతున్నాయని..
నిర్ణీత సమయం వరకు పూర్తయ్యే అవకాశం లేదని కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజా నిర్ణయంతో వాటికి చెక్ పెట్టినైట్టెంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగబోయే ఈ సిరీస్ వచ్చే నెల 8న ప్రారంభమై 14తో ముగియనుంది.
2025-01-08T20:30:18Z