ఐపీఎల్ 2023కి భారత స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆడుతుండగా శ్రేయాస్ అయ్యర్‌కి వెన్ను నొప్పి వచ్చింది. దాంతో లాస్ట్ టెస్టులో కనీసం బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. సుదీర్ఘకాలంగా శ్రేయాస్‌ని వెన్ను గాయం వేధిస్తున్న విషయం తెలిసిందే.
వెన్ను గాయం తిరగబెట్టడంతో స్కానింగ్ చేసిన వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారట. కానీ.. సర్జరీకి తొలుత నిరాకరించిన శ్రేయాస్ అయ్యర్ నొప్పిని అధిగమిస్తూ మళ్లీ ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే సమస్య తీవ్రత పెరగడంతో ఐపీఎల్ 2023కి మొత్తానికీ ఈ స్టార్ ప్లేయర్ దూరంగా ఉండబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని కెప్టెన్‌గా నడిపిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. టీమ్‌కి దూరమవడం ఆ జట్టుకి పెద్ద లోటు. అలానే ఐపీఎల్ 2023కి దూరంగా ఉండబోతున్న భారత మూడో ప్లేయర్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా టోర్నీకి దూరమవగా.. ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయానికి సర్జరీ చేయించుకుని ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు.
Read Latest
,
,
2023-03-18T13:30:15Z dg43tfdfdgfd