INDW VS SAW | టాస్ గెలిచిన భార‌త్.. ట్రోఫీని అందుకునేది ఎవ‌రో..?

INDW vs SAW : సొంత‌గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికాను వ‌న్డే, ఏకైక టెస్టులో చిత్తు చేసిన భార‌త జ‌ట్టు కీల‌క మ్యాచ్‌కు సిద్ద‌మైంది. సిరీస్ విజేత‌ను నిర్ణ‌యించే మూడో టీ20లో విజ‌య‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతోంది. చిదంబరం స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. ఛేజింగ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ తీసుకుంది.

రెండో టీ20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ప‌ట్టేయాల‌ని స‌ఫారీ జ‌ట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భార‌త్ విజ‌యంతో సిరీస్ పంచుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

భార‌త జ‌ట్టు : ష‌ఫాలీ వ‌ర్మ‌, స్మృతి మంధాన‌, ద‌యాల‌న్ హేమ‌ల‌త‌, జెమీమా రోడ్రిగ్స్, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ఉమ ఛెత్రి (వికెట్ కీప‌ర్), దీప్తి శ‌ర్మ‌, పూజా వ‌స్త్రాక‌ర్, రాధా యాద‌వ్, ఆశా శోభ‌న‌, రేణుకా సింగ్.

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బిష్త్, మ‌రిజానే కాప్, అన్నెకె బొస్చ్‌, కొలె ట్ర‌యాన్, న‌డినె డి క్లెర్క్, అన్నెరీ డెర్క్‌సెన్, ఎలిజ్ మ‌రి మార్క్స్, సినాలో జ‌ఫ్తా(వికెట్ కీప‌ర్), అయ‌బొంగ ఖాక‌, నొనుకెలెలెకొ ల‌బా.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-07-09T13:22:46Z