IND VS ZIM | టాస్ గెలిచిన భార‌త్.. ఐపీఎల్ హిట్ట‌ర్‌కు చాన్స్

IND vs ZIM : తొలి టీ20లో అనూహ్యంగా ఓడిన‌ భార‌త జ‌ట్టు (India) రెండో మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. విజ‌యంతో సిరీస్ స‌మం చేయాల‌నుకుంటున్న కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు.

మొద‌టి మ్యాచ్‌లో బ్యాటింగ్ యూనిట్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండ‌యా కూర్పులో మార్పులు చేసింది. పేస‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్ స్థానంలో ఐపీఎల్ హిట్ట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఆతిథ్య జ‌ట్టు మాత్రం ఏ మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది.

భార‌త జ‌ట్టు : అభిషేక్ శ‌ర్మ‌, రుత‌రాజ్ గైక్వాడ్, సాయి సుద‌ర్శ‌న్, శుభ్‌మ‌న్ గిల్(కెప్టెన్), రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్), వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.

జింబాబ్వే జ‌ట్టు : త‌డివ‌న‌షె మ‌రుమ‌ని, ఇన్నోసెంట్ కియా, బ్రియాన్ బెన్నెట్, సికింద‌ర్ ర‌జా(కెప్టెన్), డియోన్ మేయ‌ర్స్, జొనాథ‌న్ కాంప్‌బెల్, క్లైవ్ మ‌దండె(వికెట్ కీప‌ర్), వెస్లే మ‌ధీవెరె, లుకె జాంగ్వే, బ్లెస్సింగ్ ముజ‌ర‌బ‌ని, తెండాయ్ చ‌త‌ర‌.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-07-07T10:59:31Z dg43tfdfdgfd