IND VS ZIM | టాస్ గెలిచిన టీమిండియా.. ఐపీఎల్ హీరోల‌ అరంగేట్రం

IND vs ZIM : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో భార‌త కుర్ర‌ జ‌ట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ద‌మైంది. హారారేలోని స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubamn Gill) బౌలింగ్ తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ హీరోలు అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేస్తున్నార‌ని గిల్ తెలిపాడు. సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో భార‌త కుర్రాళ్లు ఆడుతున్న తొలి సిరీస్ ఇది. దాంతో, విజ‌యంతో సిరీస్ వేట మొద‌లెట్టాలని భావిస్తోంది.

భార‌త జ‌ట్టు : అభిషేక్ శ‌ర్మ‌, రుత‌రాజ్ గైక్వాడ్, శుభ్‌మ‌న్ గిల్(కెప్టెన్), రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్), వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వి బిష్ణోయ్, ఖ‌లీల్ అహ్మ‌ద్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.

జింబాబ్వే జ‌ట్టు : త‌డివ‌న‌షె మ‌రుమ‌ని, ఇన్నోసెంట్ కియా, బ్రియాన్ బెన్నెట్, సికింద‌ర్ ర‌జా(కెప్టెన్), డియోన్ మేయ‌ర్స్, జొనాథ‌న్ కాంప్‌బెల్, క్లైవ్ మ‌దండె(వికెట్ కీప‌ర్), వెస్లే మ‌ధీవెరె, లుకె జాంగ్వే, బ్లెస్సింగ్ ముజ‌ర‌బ‌ని, తెండాయ్ చ‌త‌ర‌.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-07-06T10:55:27Z