Gukesh | సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు తొలి విజయం దక్కింది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్.. 37వ ఎత్తులో ఆటను ముగించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిన గుకేశ్.. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. 13వ ఎత్తు తర్వాత ఆటలో ఆధిక్యం సాధించిన గుకేశ్.. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించి లిరెన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ విజయం తర్వాత ఇరువురు ఆటగాళ్లు తలా 1.5 పాయింట్లతో సమంగా నిలిచారు.
2024-11-27T23:26:24Z