క్రైస్ట్‌చర్చ్: ఇండ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో.. న్యూజిలాండ్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips) కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ గల్లీ దిశగా పవర్‌ఫుల్ కట్ షాట్ ఆడాడు. అయితే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్.. గాలిలో కుడి వైపు ఎగురుతూ ఒంటి చేతితో క్యాచ్ పట్టుకున్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో పోప్ ఔటయ్యాడు. అద్భుతమైన క్యాచ్ పట్టిన ఫిలిప్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
ఇక ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేశాడు. అతను 132 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 319 రన్స్ చేసింది. ఇంకా 29 రన్స్ ఇంగ్లండ్ వెనుకబడి ఉన్నది. పోప్, బ్రూక్ మధ్య 151 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.
ఆల్‌రౌండర్ ఫిలిప్స్‌ను.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు సొంతం చేసుకున్నది. అతని బేస్ ప్రైజ్ 2 కోట్లు. గతంలో ఫిలిప్స్ సన్‌రైజర్స్ తరపున ఆడాడు. జెడ్డాలో జరిగిన వేలం తొలి రౌండ్‌లో అతను అమ్ముడుపోలేదు.