David Warner : అంతర్జాతీయ క్రికె ట్‌కు రిటైర్మెంట్ పలికిన డేవిడ్ వార్నర్(David Warner) యూటర్న్‌కు సిద్ధమయ్యాడు. ఆడినంత కాలం తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన డేవిడ్ భాయ్.. ఇంకా క్రికెట్ ఆడాలని తపిస్తున్నాడు. ఒకవేళ అవకాశం రావాలేగానీ వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో ఆడేందుకు తాను రెడీ అని ప్రకటించాడు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నర్ తన టెస్టు కెరీర్ ఘనతలకు సంబంధించిన పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో తన పునరాగమనం గురించిన ఆలోచనలు పంచుకున్నాడు. ‘అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ సమయం ఓపెనర్‌గా ఆడడం నిజంగా గొప్ప ఫీలింగ్. ఆస్ట్రేలియా నా జట్టు. నా కెరీర్ ఎక్కువగా అంతర్జాతీయ fసరిపోయింది. అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడాను. నా జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక కొన్నాళ్లు ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడుతా.
ఒకవేళ సెలెక్టర్లు నన్ను చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేస్తే మళ్లీ ఆసీస్ జెర్సీ వేసుకుంటా. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. హెడ్‌కోచ్ అండ్రూ మెక్‌డొనాల్డ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వల్లే అవన్నీ సాధ్యమయ్యాయి’ అని వార్నర్ తెలిపాడు.
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు.. వరల్డ్ కప్ ట్రోఫీతో వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అతడు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బద్దలు కొట్టాడు. ప్రస్తుతానికి వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.