HYDERABAD | ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌కు రెండో విజయం

Hyderabad | రాజ్‌కోట్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (స్మాట్‌)లో హైదరాబాద్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజ్‌కోట్‌లో బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బీహార్‌ 20 ఓవర్లలో 118/9 పరుగులకే పరిమితమైంది హైదరాబాద్‌ బౌలర్‌ టేకులపల్లి రవితేజ (4/24) రాణించాడు.

అనంతరం లక్ష్యాన్ని హైదరాబాద్‌ 12.3 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదనను పూర్తి చేసింది. రోహిత్‌ (56 నాటౌట్‌), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (51 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. స్మాట్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో హైదరాబాద్‌కు ఇది రెండో విజయం.

2024-11-29T20:12:13Z