పెర్త్: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మంగళవారం స్వదేశానికి తిరిగొచ్చాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఢిల్లీకి వచ్చినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గంభీర్ మంగళవారం ఉదయమే వ్యక్తిగత కారణాలతో భారత్‌కు బయలుదేరాడు.
డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టు కల్లా అతడు జట్టుతో కలుస్తాడు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అడిలైడ్ టెస్ట్ కంటే ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ లెవన్‌తో రెండు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్ బుధవారం భారత జట్టుకు విందు ఇవ్వనున్నారు.
2024-11-26T20:10:55Z