సాత్విక్‌ జోడీ ముందంజ

కౌలాలంపూర్‌: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మలేషియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21-15, 21-15తో మలేషియాకే చెందిన అజ్రిన్‌ అయూబ్‌-టాన్‌ వి కియోంగ్‌ను ఓడించింది. వరుస గేమ్‌లను గెలుచుకున్న భారత షట్లర్లు.. 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు.

సాత్విక్‌-చిరాగ్‌ మినహా మిగిలిన భారత షట్లర్లు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, మాళవిక బన్సోద్‌, క్రాస్టో-ధ్రువ్‌ జోడీ రౌండ్‌ ఆఫ్‌-16లోనే నిష్క్రమించింది.

2025-01-09T21:30:44Z