సత్తాచాటిన టీటీ ప్లేయర్లు

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: ఇండోర్‌(మధ్యప్రదేశ్‌) వేదికగా జరిగిన యూటీటీ జాతీయ పారా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. పురుషుల ఫైనల్లో హితేశ్‌ దోల్వాని 11-6, 11-5, 11-4తో విశ్వ తంబె(మహారాష్ట్ర)పై గెలిచి టైటిల్‌ విజేతగా నిలిచాడు.

మహిళల క్లాస్‌-4 తుది పోరులో విజయ దీపిక 10-12, 7-11, 9-11తో భవీనా పటేల్‌(గుజరాత్‌) చేతిలో రన్నరప్‌గా నిలిచింది. మహిళల క్లాస్‌ 8లో నిశాకుమారి 4-11, 5-11, 9-11తో సవితా అంజనకట్టి(కర్నాటక) చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.

2024-11-29T19:57:13Z