వాంఖడే వన్డే ముంగిట కెప్టెన్ తరహాలో కోహ్లీ స్పీచ్.. రోహిత్ శర్మ లేకపోవడంతో?

ఆస్ట్రేలియా (Australia)తో వాంఖడే వేదికగా శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కాసేపు భారత కెప్టెన్ తరహాలో స్పీచ్ ఇచ్చాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్ సెషన్ ముగిసిన తర్వాత సాధారణంగా ఆటగాళ్లందరితో కెప్టెన్ మాట్లాడతాడు. ఈ క్రమంలో తుది జట్టు ఎంపికపై కూడా కెప్టెన్ నిర్ణయాలు ప్రకటిస్తాడు. కానీ.. ఈరోజు తొలి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండిపోయాడు. దాంతో కెప్టెన్‌గా భారత్ జట్టుని హార్దిక్ పాండ్య నడిపిస్తున్నాడు.

తొలి వన్డే ముంగిట తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య స్థానంలో విరాట్ కోహ్లీ స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, తుది జట్టుపై కూడా కోహ్లీ నిర్ణయాల్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్య‌తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మౌనంగా చూస్తుండిపోయారు. వన్డేల్లో భారత్ జట్టుని కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య నడిపిస్తుండటం ఇదే తొలిసారి.

2017 నుంచి 2021 చివరి వరకూ వన్డేల్లో భారత్ జట్టుని కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నడిపించాడు. కానీ.. ఆ తర్వాత కేవలం 4 నెలల వ్యవధిలోనే టీ20లతో పాటు వన్డే, టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత మళ్లీ కెప్టెన్‌గా కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా వ్యవహరించలేదు. రోహిత్ శర్మ టీమ్‌లో ఉంటే కేవలం బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌కే కోహ్లీ పరిమితమవుతున్నాడు. లీడర్‌షిప్ గ్రూప్‌లో పెద్దగా కనిపించడం లేదు.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-17T09:59:38Z dg43tfdfdgfd