India vs Australia 1st ODI Highlights : ఆస్ట్రేలియా(Australia)తో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ (India) జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో కేఎల్ రాహుల్ (75 నాటౌట్: 91 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 69 బంతుల్లో 5x4) కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి ఆరో వికెట్‌కి అజేయంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ జట్టుని గెలిపించింది.
వాస్తవానికి 189 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3), శుభమన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) వరుసగా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. నెం.5లో బ్యాటింగ్‌కి వెళ్లిన కేఎల్ రాహుల్ చివరి వరకూ క్రీజులో నిలిచి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి కెప్టెన్ హార్దిక్ పాండ్య (25: 31 బంతుల్లో 3x4, 1x6) కాసేపు సపోర్ట్ అందించగా.. ఆఖర్లో జడేజా అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టాయినిస్ రెండు వికెట్లు తీశారు. ఇక రెండో వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది.
అంతకముందు ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో 10x4, 5x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ట్రావిస్ హెడ్ (5), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (22), మార్కస్ లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (26), కామెరూన్ గ్రీన్ (12), మాక్స్‌వెల్ (8), స్టాయినిస్ (5), సీన్ అబాట్ (0), ఆడమ్ జంపా (0) వరుసగా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా రెండు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
Read Latest
,
,
2023-03-17T15:44:47Z dg43tfdfdgfd