రెండో వన్డేలోనూ కివీస్‌ గెలుపు

హమిల్టన్‌ : స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కివీస్‌.. 113 పరుగుల తేడా(డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో)తో లంకను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 37 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

రచిన్‌ రవీంద్ర (79), చాప్‌మన్‌ (62) రాణించారు. లంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ (4/44) వన్డేలలో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో లంకేయులు 30.2 ఓవర్లలో 142 పరుగులకే చేతులెత్తేశారు. కమిందు మెండిస్‌ (64) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇది వరకే సిరీస్‌ను దక్కించుకున్న కివీస్‌.. ఈనెల 11న ఆక్లాండ్‌ వేదికగా మూడో వన్డే ఆడనుంది.

2025-01-08T20:00:15Z