రెండో రౌండ్‌కు సింధు, లక్ష్యసేన్‌

లక్నో: స్వదేశంలో జరుగుతున్న సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ రెండో రౌండ్‌కు ప్రవేశించారు. రెండేండ్ల తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న సింధు.. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో 21-17, 21-15తో భారత్‌కే చెందిన అన్మోల్‌ ఖర్బ్‌ను ఓడించింది. రెండో రౌండ్‌లో సింధు.. ఇరా శర్మతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-12, 21-12తో షోలేహ్‌ ఐదిల్‌ (మలేషియా)పై అలవోక విజయం సాధించాడు. లక్ష్యతో పాటు కిరణ్‌ జార్జి.. 21-12, 23-21తో అలప్‌ మిశ్రా (భారత్‌)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక, అనుపమ , ఇషారాణి, దేవిక, ఉన్నతి, తస్నిమ్‌ మిర్‌, శ్రీయాన్షి ముందంజ వేశారు.

2024-11-27T23:11:25Z