మనీశ్‌పాండే, అశ్రిత దూరం దూరం!

బెంగళూరు: టీమ్‌ఇండియా క్రికెటర్ల వైవాహిక జీవితం ఒడిదొడుకుల పయనంగా సాగుతున్నది. ఇప్పటికే స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్‌తో తెగదెంపులు జరుగగా, యజువేంద్ర చాహల్‌, ధనశ్రీ మధ్య విబేధాలు పొడచూపగా, తాజాగా మరో జంట ఈ జాబితాలో చేరింది. మనీశ్‌పాండే, అశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకరికొకరు సోషల్‌మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. 2019 డిసెంబర్‌ 2 ఒక్కటైన మనీశ్‌, అశ్రిత గత కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. అశ్రిత తన సోషల్‌మీడియాలో మనీశ్‌ ఫొటోలు తీసేయగా, మనీశ్‌ కూడా అదే పని చేస్తూ అన్‌ఫాలో చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 29వన్డేలు, 39 టీ20లు ఆడిన మనీశ్‌ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 117 పరుగులకే పరిమితమయ్యాడు.

2025-01-09T21:45:44Z