ఢిల్లీ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏటీపీ టూర్స్ (టెన్నిస్)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఆక్లాండ్ (న్యూజిలాండ్) వేదికగా జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో యుకీ బాంబ్రీ-అల్బనో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం.. 6-4, 6-4తో సాండర్ అరెండ్స్-లూక్ జాన్సన్ (పారిస్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.
ఇక అడిలైడ్ (ఆస్ట్రేలియా) ఇంటర్నేషనల్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బాలాజీ-రెయిస్ జోడీ.. 6-3, 3-6, 11-13తో హెలివార-హెన్రీ (మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది.
2025-01-08T20:30:18Z