ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో బుమ్రా

దుబాయ్‌: టీమ్‌ఇండియా పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా గతేడాది డిసెంబర్‌ నెలకు గాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ రేసులో నిలిచాడు. పురుషుల విభాగంలో ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో బుమ్రాతో పాటు ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌, దక్షిణాఫ్రికా పేసర్‌ డేన్‌ పీటర్సన్‌ పోటీలో ఉన్నారు.

డిసెంబర్‌లో బుమ్రా 3 టెస్టులాడి 22 వికెట్లతో సత్తా చాటాడు. కమిన్స్‌.. 3 టెస్టులలో 17 వికెట్లు పడగొట్టగా బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేశాడు. సఫారీ బౌలర్‌ పీటర్సన్‌ రెండు టెస్టులలో 13 వికెట్లు సాధించాడు.

2025-01-07T20:14:47Z