పాక్ అంపైర్ అలీమ్ దార్ అనూహ్య నిర్ణయం.. ఎలైట్ ఫ్యానల్ నుంచి వెలుపలికి

పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 19 ఏళ్ల పాటు ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్‌గా ఉన్న అలీమ్ దార్.. తాజాగా ఫ్యానల్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో పాకిస్థాన్‌కి చెందిన అషాన్ రజా ఫ్యానల్‌లోకి ఎంపికయ్యాడు. అలానే ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్ల సంఖ్యని 11 నుంచి 12కి పెంచారు. దాంతో దక్షిణాఫ్రికా అంపైర్ హోల్డ్‌ స్టాక్‌కి అవకాశం దక్కింది.

2002లో తొలిసారి ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ జాబితాలో చోటు దక్కించుకున్న అలీమ్ దార్.. ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ తొలి అంపైర్‌గా అప్పట్లో రికార్డుల్లో నిలిచాడు. ఈ క్రమంలో 144 టెస్టులు, 222 వన్డేలతో పాటు 69 టీ20 మ్యాచ్‌లకి అలీమ్ దార్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఓవరాల్‌గా అలీమ్ దార్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 435 అంతర్జాతీయ మ్యాచ్‌లకి అంపైర్‌గా పనిచేశాడు. ఇందులో ఏడు టీ20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ట్రోఫీలు ఉన్నాయి.

ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్ల జాబితా ఇదే: నితిన్ మీనన్ (భారత్), క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), కుమార ధర్మసేన (శ్రీలంక), మారీస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గౌహ్ (ఇంగ్లాండ్), పాల్ రైఫెల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇంగ్‌వర్త్ (ఇంగ్లాండ్), రిచర్డ్ కీటెల్‌బోరఫ్ (ఇంగ్లాండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయిల్ విల్సన్ (వెస్టీండీస్)

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-16T14:59:16Z dg43tfdfdgfd