నీరజ్‌ ది బెస్ట్‌

ఢిల్లీ: గోల్డెన్‌ బాయ్‌, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా గతేడాది ప్రపంచంలో అత్యుత్తమ పురుష జావెలిన్‌ త్రోయర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మేరకు ప్రఖ్యాత అమెరికా మ్యాగజైన్‌ ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ న్యూస్‌’.. 2024 ర్యాంకింగ్స్‌లో నీరజ్‌ చోప్రాను వరల్డ్‌ బెస్ట్‌ జావెలిన్‌ త్రోయర్‌గా గుర్తించింది.

గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌.. పలు డైమండ్‌ లీగ్‌ పోటీలలోనూ సత్తా చాటాడు. నీరజ్‌ తర్వాత రెండో స్థానంలో గ్రెనెడా అథ్లెట్‌ అండర్సన్‌ పీటర్స్‌ ఉన్నాడు. పారిస్‌లో రికార్డు త్రో తో స్వర్ణం గెలిచిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌.. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

2025-01-10T21:01:15Z