తొలి వన్డేని వీక్షించేందుకు వాంఖడే స్టేడియానికి సూపర్ స్టార్ రజినీకాంత్

భారత్, ఆస్ట్రేలియా మధ్య (India vs Australia ODI) ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth ) స్టేడియానికి వచ్చారు. ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) ప్రత్యేక ఆహ్వానం మేరకు సూపర్ స్టార్ వచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి క్రికెట్‌ అంటే మహా ఇష్టం. భారత క్రికెటర్లలో చాలా మందిని ఇప్పటికే ప్రత్యక్షంగా కలిశారు కూడా. ఇటీవల టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని కలిశారు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించారు. తొలి వన్డేని వీక్షించేందుకు సూపర్ స్టార్‌ని రమ్మని ఏంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

‘‘వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ని ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు’’ అని ఏంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని పెద్ద స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-17T09:14:38Z dg43tfdfdgfd