కావచ్చు.. కాకపోవచ్చు.. విడాకులపై స్పందించిన చాహల్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌.. తన భార్య ధనశ్రీవర్మతో విడాకులపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు. గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొస్తూ విడాకులు కావచ్చు..కాకపోవచ్చు అంటూ పేర్కొన్నాడు. ‘మీ మద్దతు లేకుండా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు. క్లిష్ట సమయాల్లో మీరు నా పట్ల చూపించిన అభిమానం మరువలేనిది.

దేశం కోసం, జట్టు కోసం, అభిమానుల కోసం ఇంకా ఆడుతాను. ప్లేయర్‌గా గర్వపడుతున్నాను. ఇటీవల నా వ్యక్తిగత విషయాలపై సోషల్‌మీడియాలో రకరకాలుగా పోస్ట్‌లు వచ్చాయి. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. మా కుటుంబ విషయాల్లో కలుగజేసుకోవద్దని మిమ్మల్నికోరుకుంటున్నాను’ అని వివరించాడు.

2025-01-09T22:00:42Z