ఓటమి అంచున లంక

  • లక్ష్యం 526, ప్రస్తుతం 103/5 
డర్బన్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్‌ అయిన ఆ జట్టు ఎదుట సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు.. 31 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేశారు.  ఆ జట్టు ఇంకా 413 పరుగులు వెనుకబడి ఉంది.
ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌  చేరిన నేపథ్యంలో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పేలా లేదు. దినేశ్‌ చండిమాల్‌ (29 నాటౌట్‌), ధనంజయ డి సిల్వ క్రీజులో ఉన్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా.. 366/5 వద్ద సెకండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (122), సారథి టెంబ బవుమా (113) శతకాలతో మెరిశారు.

2024-11-29T20:12:13Z